- Advertisement -
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టిజి ఇఎపిసెట్ ఇంజనీరింగ్ హాల్ టికెట్లు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు టిజి ఎప్‌సెట్ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మా హాల్ టికెట్లు విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 29 నుంచి మే 4 వరకు ఎప్‌సెట్ పరీక్షలు పరీక్షలు జరుగనున్నాయి. ఈ నెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేక్ష, మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరుగనున్నాయి. రోజూ రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ సంవత్సరం హాల్ టికెట్లు గూగుల్ మ్యాప్స్‌కి లింక్ చేయబడిన క్యూఆర్ కోడ్ ముద్రించారు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించడానికి, నావిగేట్ చేయడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత పరీక్ష కేంద్రం ఎంత దూరంలో ఉందో తెలుసుకోవచ్చు.
- Advertisement -