Wednesday, January 22, 2025

ముగిసిన ఎంసెట్ పరీక్షలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిగిన ఎంసెట్ పరీక్ష ఆదివారం ముగిసింది. కంప్యూటర్ బెస్డ్‌లో జరిగిన ఆన్‌లైన్ పరీక్ష ఈ నెల 12,13,14 తేదీలలో నిర్వహించారు. చివరి రోజు ఉదయం సెషన్‌లో 95.35 శాతం హాజరు నమోదు కాగా, మధ్యాహ్నం సెషన్‌లో 95.36 శాతం హాజరు నమోదైంది. ఆదివారం ఒక విద్యార్థిపై బయట నుంచి పరీక్షా కేంద్రంలోకి మెటీరియల్ తీసుకువచ్చినట్లు ఇన్విజిలేటర్ గుర్తించి, అతనిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారు.

ఐదు రోజుల పాటు జరిగిన అగ్రికల్చర్, ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షలలో మొత్తం ముగ్గురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. మూడు రోజుల పాటు జరిగిన ఇంజనీరింగ్ ఎంసెట్‌కు మొత్తం 2,05,351 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,95,275 మంది (95.09 శాతం) హాజరయ్యారు. అలాగే అగ్రికల్చర్, ఇంజనీరింగ్ విభాగాలకు కలిపి 3,20,683 మంది దరఖాస్తు చేసుకోగా, 3,01,789 మంది (94.11 శాతం) మంది హాజరైనట్లు ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్ తెలిపారు.
సోమవారం ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల
ఇంజనీరింగ్ ఎంసెట్ ఆన్‌లైన్ ప్రిలిమినరీ కీ తోపాటు విద్యార్థుల రెస్పాన్స్ షీట్‌ను సోమవారం(మే 15) రాత్రి 8 గంటల నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్ తెలిపారు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 17 రాత్రి 8 గంటల వరకు వెబ్‌సైట్‌లోని లింక్ ద్వారా పంపవచ్చని పేర్కొన్నారు. ఇతర పద్దతుల ద్వారా పంపించే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News