Monday, December 23, 2024

తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని జెన్‌ఎఎఫ్‌ఎయు ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, వైద్య విభాగాలకు సంబింధించిన ఫలితాల వివరాలను వెల్లడించారు. అగ్రికల్చర్ విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత సాధించగా ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఎం సెట్ అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించగా, 12 నుంచి 15 వరకు ఆరు విడుతల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసి అభ్యంతరాలను అధికారులు స్వీకరించిన విషయం విధితమే.

ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News