Sunday, December 22, 2024

17 వరకు ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల నమోదు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదు గడువును ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ సోమవారం ముగియనుండగా, తాజాగా సాంకేతిక విద్యాశాఖ గడువును పొడిగించింది. రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో 70,307 ఇంజనీరింగ్ సీట్లు ఇప్పటికే ఖరారు కాగా, అదనంగా మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్‌లో అదనపు సీట్లను అందుబాటులోకి తీసుకురావాలని వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ రెండు రోజుల పాటు సాంకేతిక విద్యాశాఖ వాయిదా వేసింది. ఇంజనీరింగ్ సీట్లు మార్చుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఎఐసిటిఇ)

అనుమతి ఇవ్వడంతో ప్రైవేట్ కాలేజీలు చాలా వరకు ఇతర బ్రాంచీల సీట్లకు సిఎస్‌ఇకి మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. అదనపు సీట్లు మంగళవారం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం సాయంత్రం వరకు 93,167 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అందులో ఒక విద్యార్థి అత్యధికంగా 1,025 ఆప్షన్లు ఎంపిక చేసుకున్నట్లు సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. అయితే గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తేదీన మొదటి విడత ఇంజనీరింగ్ సీట్లు కేటాయించాల్సి ఉంది. తాజాగా వెబ్ ఆప్షన్ల నమోదు గడువు పొడిగించిన నేపథ్యంలో సీట్ల కేటాయింపు రెండు మూడు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News