Wednesday, January 22, 2025

టిఎస్ ఎంసెట్ మొదటి విడుత కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్ ఎంసెట్ మొదటి విడుత కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు సాంకేతిక విద్యా కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఇప్పటివరకు స్లాట్ 80449 మంది అభ్యర్థులు చేసుకున్నట్లు ఆదివారం నుంచి దృవీకరణపత్రాల పరిశీలన 12వ తేదీన గ్రూపుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.ఎంపిక చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 64416, అభ్యర్థి వినియోగించే గరిష్ట ఎంపికల సంఖ్య 1048 ఉందని వెల్లడించారు. వివరణాత్మక నోటిఫికేషన్, హెల్ప్ లైన్ కేంద్రాల జాబితా, కోర్సులు, కౌన్సెలింగ్ విధానం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మెరుగైన కళాశాల ఎంపిక, కోర్సులో కేటాయింపుల పొందడానికి వీలైనంత సమయం ఉందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News