Thursday, January 23, 2025

ఈనెల 20న ఈసెట్ పరీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః తెలంగాణ ఈసెట్ పరీక్ష ఈనెల 20వ తేదీన నిర్వహిస్తుండటంతో విద్యార్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఈసెట్ కన్వీనర్ తెలిపారు. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు కేంద్రాలకు 7.30 గంటలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే వారు బ్లూ బాల్ పాయింట్ పెన్ను, హాల్ టికెట్, ఆధార్‌కార్డు తప్పకుండా తీసుకురావాలని పేర్కొన్నారు.

సెల్‌పోన్లు, డిజిటల్ వాచ్‌లు, ఎలక్ట్రికల్ పరికరాలకు అనుమతిలేదన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 91 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ రీజన్‌లో 40, తెలంగాణ జిల్లాలో 44, ఆంద్రప్రదేశ్‌లో 07 కేంద్రాలు సిద్దం చేసినట్లు వెల్లడించారు. ఈపరీక్షకు 23263 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్ష ప్రారంభమైన తరువాత పరీక్షకు అనుమతించమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News