మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టిఎస్ ఎడ్‌సెట్ 2024 పరీక్ష మంగళవారం జరగనున్నది. ఈ పరీక్ష కోసం తెలంగాణలో 79, ఎపిలోని కర్నూల్, విజయవాడలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు గంటల పాటు నిర్వహించే ఈ పరీక్షను ఒకేరోజు రెండు సెషన్లలో నిర్వహిస్తారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండవ సెషన్ జరుగనున్నది. మొత్తం 33,897 మంది విద్యార్థులు ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోగా, మొదటి సెషన్‌కు 16,929 మంది, రెండవ సెషన్‌కు 16,950 మంది రాయనున్నారు. విద్యార్థులు పరీక్షా సమయానికి గంటన్నర ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని ఎడ్‌సెట్ కన్వీనర్ మృణాళిని సూచించారు. విద్యార్థులు https:// edcet.tsche.ac. in వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు.