రాష్ట్రంలో బి.ఇడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టిజిఎడ్‌సెట్, వ్యాయామ విద్యలో ప్రవేశాలకు నిర్వహించే టిజిపిఇసెట్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఎడ్‌సెట్, పిఇసెట్ నిర్వహణకు గురువారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన ఆయా సెట్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయా సెట్ల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఎడ్‌సెట్ కన్వీనర్ వెంకట్రాంరెడ్డి, పిఇసెట్ కన్వీనర్ ఎన్.ఎస్.దిలీప్ పాల్గొన్నారు. రాష్ట్రంలో బి.ఇడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టిజి ఎడ్‌సెట్ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది.
ఈ పరీక్షకు మార్చి 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి, మార్చి 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ ఒకటవ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష జరుగనున్నది. అలాగే బిపి.ఇడి, డిపి.ఇడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టిజి పిఇసెట్‌ను పాలమూరు యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఈ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను మార్చి 12న విడుదల చేసి, 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 11న పాలమూరు యూనివర్సిటీలో ఫిజికల్ ఎఫిషియెన్సీ అండ్ స్కిల్ టెస్టును నిర్వహించనున్నారు.
టిజి ఎడ్‌సెట్ షెడ్యూల్
నోటిఫికేషన్ తేదీ : మార్చి 10
అన్‌లైన్ దరఖాస్తులు : మార్చి 12 నుంచి మే 13 వరకు(ఆలస్య రుసుం లేకుండా)
పరీక్ష తేదీ : జూన్ 1
టిజి పిఇసెట్ షెడ్యూల్
నోటిఫికేషన్ విడుదల: మార్చి 12
ఆన్‌లైన్ దరఖాస్తులు : మార్చి 15 నుంచి మే 24 వరకు (అలస్య రుసుం లేకుండా)
పరీక్ష : జూన్ 11న ఫిజికల్ ఎఫిషియెన్సీ అండ్ స్కిల్ టెస్టు