Friday, December 20, 2024

నేడే టిఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ ఎంట్రెన్స్ టెస్టు నేడు జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈపరీక్షకు 31,725 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ, ఏపిలో ఏర్పాటు చేసి 49 పరీక్షా కేంద్రాల్లో మూడు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11 గంటలవరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2. 30 గంటల వరకు, మూడు సెషన్ సాయంత్ర 4 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించనున్నారు.

మొదటి సెషన్‌లో 10,565 మంది విద్యార్థులు, రెండో సెషన్‌లో 10,584 మంది, మూడోసెషన్‌లో 10, 576 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షకు ఆలస్యంగా వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని, పరీక్ష సమయానికి 90 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొపెసర్. రామకృష్ణ సూచించారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, పరీక్ష కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతే అనుమతిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News