Thursday, January 23, 2025

షూటింగ్స్ ఆపేసే ప్రసక్తే లేదు…

- Advertisement -
- Advertisement -

New Telugu Movie Shootings Stop from Aus 1st

ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ నిలిపేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ… ఆ నలుగురు తమకు ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ మిగతా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టియఫ్‌సిసి) ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మండిపడ్డ్డారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ “మా టియఫ్‌సిసిలో ప్రస్తుతం 50 మంది నిర్మాతలు సినిమా షూటింగ్‌లు నిర్వహిస్తున్నారు. నా సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఇంకా రెండు రోజులే బ్యాలెన్స్ ఉంది. ఇలాంటి పరిస్థ్థితుల్లో షూటింగ్స్ అకస్మాత్తుగా ఆపేస్తే వర్కర్‌లతో పాటు మిగతా వారిందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఆగస్ట్ 1 నుండి షూటింగ్స్ నిలిపేస్తున్నామని కొందరు నిర్మాతలు అంటున్నారు. అసలు షూటింగ్స్ ఎందుకు నిలిపివేస్తున్నారో తెలియడం లేదు. కొందరు తమ స్వార్థం కోసం ముఖ్యమంత్రులను ఒకటికి నాలుగుసార్లు కలిసి టికెట్ రేట్లు పెంచుకున్నారు.

మళ్లీ థియేటర్స్‌కి ప్రేక్షకులు రావడం లేదని షూటింగ్స్ నిలిపివేయాలంటున్నారు. అసలు ఇది ఎంత వరకు కరెక్టో అర్థం కావడం లేదు. మేము అయితే సినిమా షూటింగ్స్ ఆపేదే లేదు. కరోనా పరిస్థితుల నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే షూటింగ్స్ జరుపుకుంటోన్న సమయంలో ఇలా షూటింగ్స్ అకస్మాత్తుగా ఆపడం సమంజసం కాదు. ఓటీటీకి సినిమాలు ఇవ్వొద్దు అంటే చిన్న నిర్మాతలు బతికేదెలా? ఆ పది మంది నిర్మాతలే బతకాలా? మీకు లాభాలు వచ్చినప్పుడు సైలెంట్‌గా ఉండి.. మీకు ఇబ్బంది వస్తే రూల్స్ మార్చడం, షూటింగ్స్ నిలిపేయడం కరెక్టా. షూటింగ్స్ బంద్ అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. టికెట్స్ రేట్లు తగ్గించాలి. థియేటర్లలో తినుబండారాల రేట్లు తగ్గించాలి. ఓటీటీకి ఎనిమిది, పది నెలల తర్వాతే సినిమాలు ఇవ్వాలంటే నిర్మాతకు ఇబ్బంది అవుతుంది. దీనిపై కూడా పునరాలోలించాలి”అని అన్నారు. ఈ సమావేశంలో టియఫ్‌సిసి ఉపాధ్యక్షుడు ఎ.గురురాజ్, కార్యదర్శ సాగర్, హీరో సురేష్ బాబు, చెన్నారెడ్డి, కిషోర్, సతీష్, రాఖీ తదితరులు పాల్గొన్నారు.

TS film Chamber of Commerce denied stop shoots

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News