2030 నాటికి రోడ్డుపై 80
శాతంపైగా విద్యుత్ వాహనాలు
ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు
హైదరాబాద్: గ్రేటర్‌లో రోజురోజుకు వాహనాల ద్వారా కాలుష్యం అధికంగా అవుతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాంగా విద్యుత్ వాహనాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ వాహనాలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా అనేక రాయితీలను కల్పించిం ది. కేవలం రాయితీలను కల్పించడంతో సరిపెట్టడమే కాకుండా వాటి తయారీ రంగపై కూడృ దృష్టి సారించింది. విద్యుత్ వాహనాలపై ప్రభుత్వం రూపొందించిన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి విస్తృత ప్రచారం నిర్వహించాలని ఈ మేరకు మంత్రి ఆదేశాలు కూడాజారీ చేసినట్లు సమాచారం. దీనికి అనుగుణంగానే విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను పెద్ద సంఖ్యలో పెంచే బాధ్యతను రెడ్కొ సంస్థకు అప్పగించింది. ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థకు కేంద్ర బిందువుగా మార్చేందుకు ప్రభుత్వం విద్యుత్ హహన ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020…30ని రూపొందింది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో వాహనాల ఉత్పత్తికి భారీ ప్రోత్సహకాలను ఇవ్వనున్నారు. తయారీదారులు, వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలను అమలు చేయనున్నారు. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ,రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రాయితీలు ప్రకటించింది.
ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుదారులకు రాయితీలు ప్రకటించడంతో ఇప్పటికే అనేక మంది విద్యుత్ వాహానాలపై దృష్టి సారించారు. ఒక వైపు పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ చార్జీలతో విద్యుత్ వాహనాలు కోనుగోలు చేయడం ద్వారా మినిమంమ మెయింటెనెన్స్‌తో రవాణా సదుపాయం వస్తుందని భావిస్తున్నారు. డీజిల్, పెట్రోల్ అయ్యే వహనాలనికి అయ్యే ఇంధన వ్యయంతో కొత్త విద్యుత్ వాహనాన్ని ఈఎంఐల రూపంలో తీసుకోవచ్చని వినియోగదారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది విద్యుత్ వానాలపై దృష్టి సారించారు. అంతే కాకుండా ఉద్యోగులు విద్యుత్ వాహనాలు తీసుకుంటే ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని, ఈఎంఐ అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చార్జింగ్ పాయింట్లను విస్తృతంగా ఏర్పాటు చేసేబాద్యతను రెడ్కొకు అప్పగించింది. దీనిపై ఇప్పటికే చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై సర్వేను ప్రారంభించింది. విద్యుత్ సబ్‌స్టేషన్ల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలను పరిశీలిస్తున్నారు. 2022 సంవత్సరంలో భారీగా విద్యుత్ వాహనాలను రోడ్డు మీదకు తీసుకు వచ్చేవిధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. విద్యుత్ వాహనాల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై విస్త్రత ప్రచారం చేయాలని నిర్ణయించారు.
2030 నాటికి హైదరాబాద్ నగరంలో 80 నుంచి 90 శాతం విద్యుత్ వాహనాలే కనిపించే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. డీజిల్ వాహనాలను తగ్గించడం ద్వారానే కాలుష్యాన్ని నియంత్రించవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విద్యుత్ వాహానం తయారయ్యే 2 లక్షల ద్విచక్ర వాహనాలు, 30 వేల ఆటో రిక్షాలు, 5 వేల కార్లు,500 విద్యుత్ బస్సులకు రోడ్ల రిజిస్ట్రేషన్‌లలో రాయితీ కల్పించారు. విద్యుత్ ట్రాక్టర్లకు రవాణాశాఖ నిబంధనల ప్రకారం 100 శాతం రోడ్ ట్యాక్స్ మినహయింపు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ నలుదిక్కులా మెట్రో స్టేషన్లకు బ్యాటరీ ఆధారిత వాహనాలను నిర్వహించే ప్రతిపాదన, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇతర నగరాల్లో దశలవారీగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వీటికి ప్రత్యేక టారిఫ్ వసూలకు నిర్ణయం. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై రెడ్కొ నిర్ణయం తీసుకుంటుంది వంటి పలు ప్రతిపాదనలతో పాటు భవిష్యత్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు.