Sunday, January 19, 2025

గ్రూప్ 2, 3, 4లో మరిన్ని కొలువులు

- Advertisement -
- Advertisement -

గ్రూప్ 2,3,4లో మరిన్ని కొలువులు
మరికొన్ని పోస్టులను కలుపుతూ ప్రభుత్వ ఉత్తర్వులు
గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరణ
త్వరలో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. గ్రూప్ 2,3,4 ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో మరికొన్ని రకాల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం చేర్పించి. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన శాఖ సవరించింది. గ్రూప్ -2లో కొత్తగా ఆరు రకాల పోస్టులు చేర్చగా, గ్రూప్ -3 రెండు రకాల పోస్టులు, గ్రూప్- 4లో నాలుగు రకాల పోస్టులు చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు తెలిపింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన 55 జిఒలో సవరణలు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా నిర్ణయంతో గ్రూప్ -2, 3, 4లో పోస్టులు మరిన్ని పెరగనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి కాగా, ఇటీవల టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ తది కీ ని విడుదల చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడగా, త్వరలోనే గ్రూప్- 2 3, 4 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌లను జారీ చేసేందుకు టిఎస్‌పిఎస్‌సి ఏర్పాట్లు చేస్తోంది.

గ్రూప్- 2లో చేర్చిన పోస్టులు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం)
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇతర శాఖలకు సంబంధించి)
జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆఫీసర్
అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్
అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్
అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్

గ్రూప్-3లో..
గిరిజ సంక్షేమ శాఖ అకౌంటెంట్
సీనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ లేదా హెచ్‌ఒడిల్లో ఇదే విధమైన పోస్టులు

గ్రూప్-4లో..
జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్
జువైనల్ సర్వీసెస్ సూపర్‌వైజర్ (మేల్)
మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్
మ్యాట్రన్ (కమిషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News