Friday, November 22, 2024

సినిమా థియేటర్లలో పార్కింగ్ వసూళ్లకు అనుమతి

- Advertisement -
- Advertisement -
TS govt allowed theaters to charge parking fees

 

ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్: సినిమా థియేటర్లలో మళ్లీ వాహనాల పార్కింగ్ ఫీజుల బాధుడుకు రంగం సిద్దమైంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ప్రేక్షకులపై భారం మోపిన ప్రభుత్వం సినిమా థియేటర్ల యజమానాలకు మాత్రం ఊరట కలిగించింది. సినిమా థియేటర్లతో పాటు మాల్స్, మల్టీప్లెక్స్ తదితర ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తూ 2018లో జిఓనంబర్ 63ను విడుదల చేసింది. అయితే కరోనా కారణంగా చాలా కాలంగా సినిమా థియేటర్లు మూత పడి ఉండడంతో నష్టాల్లో కూరుకుపోయినా యాజమన్యాలు థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూళ్లు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని తద్వారా ఆర్థిక కొంత వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ విజ్ఞప్తిని క్షుణంగా పరిశీలించిన ప్రభుత్వం జిఓ నంబర్ 63ను సవరిస్తూ సింగిల్ సినిమా థియేటర్లలో వాహనాల పార్కింగ్ ఫీజును వసూళ్లు చేసేందుకు అనుమతించింది.

థియేటర్లలో ఎక్కువ సంఖ్యలో వాహనాలు పార్క్ చేస్తుండడం, పార్కింగ్ ఫీజులు లేకపోవడంతో వాటి భద్రత విషయం సినిమా థియేటర్లకు సంబంధంలేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇక మీద సినిమా థియేటర్లలో పార్క్ చేసే వాహనాలకు పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ఇది కేవలం సింగిల్ థియేటర్లకు మాత్రమే వర్తిస్తుందని, మిగిలిన మల్టీఫ్లెక్స్, మాల్స్‌లో యాదావిధిగా ఫ్రీ పార్కింగ్ ఉంటుందని ఉత్తర్వుల్లో వెలువరించింది. అయితే సినిమా థియేటర్లలో ఇక మీదట వాహనాల పార్కింగ్‌కు సంబంధించి ఛార్జీల వసూళ్లకు అనుమతించిన ప్రభుత్వం, అయితే ఎంత వసూళ్లు చేయాలన్నది మాత్రం జిఓలో పొందపర్చలేదు. దీంతో ఈ ఛార్జీల ఏ మేరకు ఉంటాయోనని సినీ ప్రేక్షకులు భయం పట్టుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News