Wednesday, January 22, 2025

‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్ ధరలు పెంపు

- Advertisement -
- Advertisement -

TS Govt allows ticket price hike for RRR

హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ తెలంగాణ సర్కార్ శనివారం జీవో జారీ చేసింది. ప్రస్తుతమున్న ధరలపై రూ.50 పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి 3 రోజులు రూ.50, తర్వాత మూడు రోజులు రూ.30 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. మల్టీపెక్స్, ఐమాక్స్ థియేటర్లలో తొలి మూడు రోజులకు రూ. 100 పెంచుకోవచ్చని తెలిపింది. 10 రోజులపాటు రోజుకు 5 షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉదయం 7 నుంచి రాత్రి ఒంటిగంట వరకు ప్రదర్శనకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

TS Govt allows ticket price hike for RRR

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News