Monday, December 23, 2024

కల్యాణలక్ష్మి వైభోగమే

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో కల్యాణ లక్ష్మిపథకం అమలుకు రూ.1850 కోట్ల నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు శనివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బి. వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొతాన్ని పథకం అమలు కోసం నాలుగు విడుతలుగా నిధులను కేటాయించనున్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు.. పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం.. అడపిల్లల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్మాతకంగా అమలు చేస్తోంది. గతేడాది వార్షిక బడ్జెట్‌లో బిసి సంక్షేమ శాఖ రూ.1850 కోట్లు కేటాయించగా.. అందులో రూ.1412 కోట్లు పథకం అమలుకు వ్యయం చేసింది. 2022-23 వార్షిక సంవత్సరానికి రూ. 1850 కోట్ల నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతించింది. ఈ మేరకు శనివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బి. వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తాన్ని నాలుగు విడుతలుగా కల్యాణలక్ష్మీ పథకానికి అందజేయనున్నది. ఈ పథకం కింద ఒక్కో ఆడపిల్ల పెండ్లికి రూ.1,00,116 అందజేస్తున్నది. దీంతో రాష్ట్రంలో బాల్యవివాహాలు గణనీయంగా తగ్గాయి. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ విభాగాల నుంచి ఇప్పటి వరకు 11లక్షల కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధిపొందాయి. గతేడాది 238199 లబ్ధిదారులకు ఈ పథకాల కింద రూ.2313.49 కోట్లును అందజేశారు.ఆడపిల్లగా పుడితే.. తెలంగాణలో పుట్టడమే అదృష్టంగా బాలికలు కోరుకునే విధం గా.. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో బాలికలు, మహిళల సంక్షేమం, భధ్రత, భవిష్యత్ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి మళ్లీ మరో ఆడపిల్లకు తల్లి అయ్యే వరకు అడుగడుగునా తెలంగాణ ప్రభు త్వం తల్లిదండ్రిలా వారికి ప్రతి దశలో అండగా నిలుస్తూ వారి యోగక్షేమాలను చూస్తోంది. వారి భవిష్యత్ కు బాటలు వేస్తూ, భద్రత కల్పిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకునే పేదింటి ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావద్దని 2014 అక్టోబర్ 2వ తేదీనకల్యాణలక్ష్మీ/ షాదీ ముబారక్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకాల ద్వారాపెళ్లి కోసం 1,00,116/- రూపాయలను ఆర్ధిక సాయంగా అందిస్తున్నారు. ఈ పథకం వల్ల బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయి. పేదింటి తల్లిదండ్రులకు ఆడపిల్ల పెళ్లికి ఆర్ధికభారం నుంచి విముక్తి కలిగింది. కెసిఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మీ, అమ్మఒడి వాహనం, వి హబ్ తో పారిశ్రామికవేత్తలుగా, షీ క్యాబ్స్ స్కీమ్ లో కారు తీసుకోవడం కోసం మహిళలకు 35 శాతం సబ్సిడీ, 55 శాతం రుణం అందిస్తున్నారు. గత వార్షిక సంవత్సరం (2021 22) కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు బిసి, ఎస్‌సి,ఎస్‌టి, మైనార్టీ విభాగాల నుంచి 156386 దరఖాస్తులు వచ్చాయి. 2020 21సంవత్సరానికి సంబంధిత 81813 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. వాటికి గత వార్షిక సంవత్సరంలో నిధులు కేటాయించారు. మొత్తం 238199 లబ్ధిదారులకు ఈ పథకాల కింద రూ.2313.49 కోట్లును అందజేశారు.

TS Govt Allows to release funds for Kalyana Lakshmi 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News