Friday, November 22, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (కరువు భత్యం డిఎ)ను ప్రకటించింది. ఒక డిఎ (2.73 శాతం) మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని 20.02 శాతానికి పెంచినట్లు స్పెషల్ సిఎస్ కె.రామకృష్ణారావు ఉత్తర్వులో పేర్కొన్నారు. జనవరి ఫించన్‌తో కలిపి ఫిబ్రవరిలో ఫించన్‌దారులకు డిఎ చెల్లించనుంది. 2021 జులై నుంచి 2022 డిసెంబర్ నెలాఖరు వరకు 8 విడతల్లో డిఎ బకాయిలను జిపిఎఫ్‌లో జమ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనివల్ల 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.8 లక్షల మంది పెన్షనన్లకు లబ్ది పొందనున్నారు.

సిఎం కెసిఆర్ నిర్ణయం మేరకు డిఎ పెంపు: హరీశ్‌రావు
ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కరువు భత్యం 2.73 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని 20.02 శాతానికి పెంచినట్లు తెలిపారు. దీనివల్ల 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారని, ఈ పెంపు గతేడాది జులై 1 నుంచి వర్తిస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News