Monday, November 18, 2024

ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి రూ.2వేలు, 25 కిలోల బియ్యం

- Advertisement -
- Advertisement -

 

లక్షా45వేల మందికి లబ్ధి

నేడు కలెక్టర్లు, డిఇఒలు, డిఎస్‌ఒలతో మంత్రులు సబితా, గంగుల వీడియో కాన్ఫరెన్స్

TS Govt announces financial help to Private Teachers

గుర్తింపు పొందిన విద్యాసంస్థల టీచర్లు, సిబ్బందికి వర్తింపు
బియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ
బ్యాంకు అకౌంట్లు తదితర వివరాలతో జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలి
మానవత దృక్పథంతో ఆదుకోవడమే లక్ష్యం : సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్లకు ముఖ్యమంత్రి కెసిఆర్ శుభవార్త చెప్పారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సి బ్బందికి నెలనెలా రూ.2 వేలు ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి ఉచితంగా 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఏప్రిల్ నెల నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించే వరకు ఈ సహాయాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సిఎం తెలిపారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఉ.11.30 గంటలకు బిఆర్‌కె భవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు విద్యాశాఖ డిఇఒలు, పౌరసరఫరాల శాఖ డిఎస్‌ఒలు ఇతర సిబ్బంది పాల్గొంటారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను, కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం ఆదేశాలు జారీ చేయనున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బం ది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి లబ్ధిచేకూరుతుంది.

TS Govt announces financial help to Private Teachers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News