Sunday, December 22, 2024

జనవరి 1న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

2024 సంవత్సరంలో మొదటిరోజున తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి వరకూ ప్రజలంతా కొత్త సంవత్సరం వేడుకులు జరుపుకోనున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 1న జనరల్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యామ్నాయంగా జనవరి నెలలో రెండో శనివారం నెలవును రద్దు చేసింది.

కాగా, 2024 న్యూ ఇయర్ ను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో డిసెంబర్ 31న రాత్రి 1 గంట వరకూ.. పబ్ లు, క్లబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు  తెరుచుకునేందుకు ప్రభుత్వ అనుమతించింది. అయితే, ఈ వేడుకులు జరుపుకునేందుకు నిర్వహాకులు ముందుగా  పర్మిషన్ తీసుకోవాలని సూచించింది. అనుమతులు లేకుండా ఎలాంటి పార్టీలు నిర్వహించినా కఠన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News