Monday, December 23, 2024

డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకోవడానికి రూ.3లక్షలు..

- Advertisement -
- Advertisement -

TS Govt announces Rs 3 lakh for Double Bedroom

డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకోవడానికి రూ.3లక్షలు
సొంత స్థలం కలిగిన వారికి అవకాశం
బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లను కేటాయించిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: సొంత స్థలం కలిగిన వారు తమ స్థలంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకోవడం కోసం మూడు లక్షల రూపాయల చొప్పున అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈ బడ్జెట్‌లో దీనికోసం రూ.12,000 కోట్ల నిధులను కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి, సొంత స్థలంలో డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికీ మూడు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం కేటాయించనుంది. నియోజకవర్గానికి మూడువేల ఇళ్లను కేటాయించనుంది. 2022-23 ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం నిధులను ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేటాయించింది. గతంలో సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీమేరకు ఈ బడ్జెట్‌లో దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నిధులు కేటాయించారు. సిఎం నిర్ణయంతో ప్రస్తుతం నిరుపేదలకు లబ్ధి చేకూరనుంది.

TS Govt announces Rs 3 lakh for Double Bedroom

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News