Wednesday, January 22, 2025

తాగునీటి సరఫరా పర్యవేక్షణకు 10మంది ఐఏఎస్ ఆఫీసర్లు

- Advertisement -
- Advertisement -

తాగునీటి సరఫరాను పర్యవేక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం పదిమంది ఐఏఎస్ అధికారులను నియమించింది. నీటి సరఫరాను పర్యవేక్షించే ఈ అధికారులు జులై చివరి వరకూ సెలవు పెట్టకూడదని ప్రభుత్వం షరతు విధించింది. నీటి వృథాను అరకట్టి, గరిష్ఠ స్థాయిలో ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వర్షాకాలంలో ఆశించినమేరకు వానలు పడకపోవడం, ఎండల తీవ్రత అధికం కావడంతో జలాశయాల్లో నీటిమట్టాలు అడుగంటిపోతున్నాయి. భూగర్భ జలమట్టం కూడా అంతకంతకూ పడిపోయింది. ఈ నేపథ్యంలో తాగునీటికి కొరతరాకుండా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News