Monday, December 23, 2024

ప్రై’వేటు’

- Advertisement -
- Advertisement -

కొత్తగా భర్తీ అయ్యే వైద్యుల
ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం

నాన్ టీచింగ్ విభాగం నుంచి టీచింగ్ విభాగంలోకి బదిలీ ద్వారా వచ్చే డాక్టర్లకూ
వర్తింపు సీనియర్ రెసిడెంట్ వైద్యులు అసిస్టెంట్ ఫ్రొఫెసర్లుగా నియామకానికి అర్హులు
నేటి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు రాష్ట్ర వైద్యశాఖ ఉత్తర్వులు

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే ది శగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వైద్యారోగ్య శాఖలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులయ్యే వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్‌ను నిషేధిస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీ స్ నిబంధనలను మార్పులు చేయగా, మంగళవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. నాన్ టీచిం గ్ విభాగం నుంచి టీచింగ్ విభాగంలోకి బదిలీ ద్వారా వచ్చే వైద్యులు సైతం ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. క్లినికల్, నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ లేదా బదిలీ ద్వారా) కనీస అర్హతలను తాజా ఉత్తర్వుల్లో నిర్ధారించింది. అం దరు స్పెషలిస్టులు, డాక్టర్లు కచ్చితం గా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కొత్తగా నియమితులయ్యే వైద్యులు, నాన్ టీచింగ్ విభాగం నుంచి టీచింగ్ వైపు బదిలీ అయిన వారు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు. ఇప్పటికే ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారికి నిబంధన వర్తించదు.

కొత్త నియామకాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి : డిఎంఇ రమేష్‌రెడ్డి

కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం సీనియర్ రెసిడెంట్‌గా చేసిన వైద్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియామకానికి అర్హులు అని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు(డిఎంఇ) డాక్టర్ రమేష్‌రెడ్డి తెలిపారు. కొత్తగా నియమితులయ్యే వైద్యులు, నాన్ టీచింగ్ నుంచి టీచింగ్ వేపు వెళ్లే వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం వైద్యులు కన్సల్టేషన్ ప్రాక్టీస్, నర్సింగ్ హోమ్‌లు, ఆసుపత్రులు పెట్టడానికి అవకాశం లేదని అన్నారు. మంగళవారం నుంచి కొత్త నిబంధనలు ఆమలులోకి వస్తాయని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున్న కొత్త నియామకాలను జరుపబోతుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా మందులు ఉన్నాయని, ఇండెంట్ ఉన్న మెడిసిన్స్ కూడా కొంత మంది వైద్యులు బయటకు రాస్తున్నారని తెలిపారు. ఒకవేళ అవసరమైన మెడిసిన్స్ లేకపోతే కొనుగోలు కోసం సూపరింటెండెంట్ వద్ద నిధులు ఉంచామని అన్నారు. ఇప్పటి వరకు ఎవరినీ సస్పెండ్ చేయలేదని, అనవసరంగా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని డిఎంఇ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News