Wednesday, November 6, 2024

‘కిమ్స్‌’పై చర్యలు

- Advertisement -
- Advertisement -

కొవిడ్ చికిత్స అనుమతి రద్దు
మరో 5ఆసుపత్రులపైనా వేటేసిన రాష్ట్ర ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం ప్రతి రోజూ ప్రైవేట్ ఆసుపత్రులకు దడ పుట్టిస్తోంది. మంగళవారం కూడా మరో ఆరు ఆసుపత్రుల అనుమతులను రద్దు చేసింది. వీటిలో సికింద్రాబాద్‌లోని కిమ్స్, గచ్చిబౌలి సన్‌షైన్, బంజారాహిల్స్‌లోని సెంచరీ, లక్డీకపూల్‌లోని లోటస్, మెడిసైస్ ఎల్‌బినగర్, ఇంటెగ్రో టోలిచౌకి ఆసుపత్రులు ఉన్నాయి. ఈ మేరకు హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ఆయా ఆసుపత్రుల్లో కరోనా కొత్త పేషెంట్లను చేర్చుకోవద్దని, ప్రస్తుతం ఉన్న వారికి చికిత్స నిర్వహించి డిశ్చార్జ్ చేయాలని సూచించారు. రహస్యంగా పేషెంట్లను చేర్చుకుంటే సదరు ఆసుపత్రులకు లైసెన్స్‌లు కూడా రద్దు చేయనున్నట్లు డిహెచ్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 113 హస్పిటల్స్‌పై 174 ఫిర్యాదులు అందగా, అన్ని ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని డిహెచ్ తెలిపారు. వీటిలో 31.5.2021 వరకు 166 ఫిర్యాదులు రాగా, మంగళవారం మరో 8 కంప్లైంట్స్ వచ్చాయని వైద్యశాఖ పేర్కొంది. అయితే ఇప్పటి వరకు ఫిర్యాదులపై సరైన వివరణ ఇవ్వని 22 ఆసుపత్రులకు కొవిడ్ అనుమతులు రద్దు చేసినట్లు డైరెక్టర్ ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదు చేయాలనుకునే వారు 915417960 వాట్సాప్ నంబరును సంప్రదించాలని ఆయన కోరారు.

TS Govt Cancels Corona treat for Patient in KIMS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News