Friday, November 15, 2024

పోలీసు వలయంలో ‘సాగర్’

- Advertisement -
- Advertisement -

నాగార్జునసాగర్‌కు పాకిన ఆర్‌డిఎస్ జల వివాదం..పోలీసు వలయంలో ‘సాగర్’
తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న నీళ్ల గొడవ
సాగర్ డ్యామ్, పులిచింతల ప్రాజెక్టు వద్ద మోహరింపు
విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రధాన ద్వారాల వద్ద గస్తీ
భద్రత ఏర్పాట్లను సమీక్షిస్తున్న జిల్లా ఎస్పీ రంగనాథ్

మన తెలంగాణ/నాగార్జునసాగర్/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఆర్డీఎస్ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు నాగార్జునసాగర్ వరకు పాకింది. ఈ నేపథ్యంలోనే నాగార్జునసాగర్ డ్యామ్‌పై భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పోలీసు అధికారులు తెలిపారు. భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రంగనాథ్ సమీక్షించారు. ఇప్పటికే విధుల్లో ఉన్న ఎస్‌పీఎఫ్ సిబ్బందితో పాటు 100 మందిని అదనంగా మోహరించారు. జలాశ యం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రధాన ద్వారాల వద్ద పోలీసులు గస్తీ కాస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సరిహద్దులోనూ బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. కృష్ణ జలాల వినియోగంపై కృష్ణా రివర్ బోర్డుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నాగార్జునసాగర్ డ్యాంపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు శ్రీశైలం, నాగార్జునసాగర్ విద్యుత్ కేంద్రాల్లో వంద శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలంటూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు అవసరాల దృష్టా సంపూర్ణ సామర్థం మేరకు జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్‌కోను ఆదేశించింది. దాదాపు 2,500 మెగావాట్ల విద్యుత్‌ను నీటి ద్వారా ఉత్పత్తి చేయాలని స్పష్టం చేసింది. ఏపీ ఫిర్యాదులు కృష్ణా బోర్డు ఆదేశాల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి ఆవశ్యకతను వివరిస్తూ సమాధానం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కార్యక్రమంలో సీఐ గౌరినాయుడు, సాగర్, హాలియా, పెద్దవూర, ఎస్‌ఐలు పాల్గొన్నారు. కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు వద్ద ఎస్‌పి భాస్కరన్ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. టిఎస్ జెన్‌కో వద్ద భారీగా బందోబస్తు నిర్వహించారు. ప్రాజెక్ట్ సమీపంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పులిచింతల ప్రాజెక్ట్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పాదనను టిఎస్ జెన్‌కో ప్రారంభించింది. మొదటి యూనిట్ ద్వారా 16.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. పులిచింతల ప్రాజెక్టు నుండి 1500 క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువకు విడుదల చేయనున్నారు.

TS Govt deploys police at Nagarjuna Sagar dam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News