Thursday, December 26, 2024

రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

TS Govt extended school holidays more three days

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించారు. ఈ నెల 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. జూలై 18 తేదీ నుంచి స్కూళ్లు పున: ప్రారంభం కానున్నాయి. ఆకాల వర్షాల కారణంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించిన ముచ్చట తెలిసిందే. తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని రకాల విద్యాసంస్థలు సోమ, మంగళ, బుధవారాలు మూతపడ్డాయి. మూడు రోజుల సెలవులు తర్వాత గురువారం విద్యాసంస్థలు తెరుచుకోవాల్సి ఉంది. వర్షాలు తగ్గకపోవడంతో తెలంగాణ సర్కార్ విద్యాసంస్థలకు మరో మూడ్రోజుల పాటు సెలవులను పెంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News