Sunday, November 24, 2024

పద్దులో పెద్ద ఇరిగేషనే!

- Advertisement -
- Advertisement -

బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయింపు? 20లక్షల ఎకరాల కొత్త
ఆయకట్టు లక్షం, రూ.25వేల కోట్లు కేటాయించే అవకాశం

TS Govt focus on Irrigation in State Budget 2021

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటిపారుదల రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సారి వార్షిక బడ్జెట్ లో ఈ రంగానికి నిధుల కేటాయింపుల్లో పెద్దపీట వేయనుంది. ప్రాధాన్యత ప్రాజెక్టుల ప్రాతిపదికన సిద్దం చేసిన ప్రణాళిక మేరకు రూ.25వేల కోట్లకు పైగా నిధులు అవసరం అని ప్రతిపాదించింది. ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతల పధకానికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూమారు 12వేల కోట్లు ఆశిస్తున్నారు. నీటిపారుల శాఖ ప్రతిపాదనలు ఈ రంగాన్ని పునర్ వ్యవస్థీకరంచటం ద్వారా వేగవంతమైన ఫలితాలను ఆశిస్తున్న టిఆర్‌ఎస్ సర్కారు నీటిపారదల శాఖ పరిధిలోని వివిధ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చుతోంది. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో సాగునీటిపారుదల రంగానికి నిధుల కేటాయిపులో పెద్దపీట వేయాలన్న అభిప్రాయంతోవుంది. సాగునీటి పధకాల పనులు ఏళ్ల తరబడి కొనసాగకుండా లక్షం మేరకు పూర్తి చేస్తే ఆయకట్టుకు నీరంది తద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలకు చేతినిండా పనికల్పించినట్టవుంతుందని ప్రభుత్వం భావిస్తోంది. చివరి దశకు చేరిన పలు పధకాల పనులు సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల కింద భూసేకరణ, పునరావాసం తదితర వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పనులకు ఏవిధమైన ఆటంకాలు లేకుండా చూసుకోవాలని సిఎం అధికారులకు సూచించారు.

వచ్చేబడ్జెట్‌లో నీటి పారుదల రంగానికి రూ.25వేలకోట్లకు పైగా నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సారి బడ్జెట్‌లో నిధులు ప్రాజెక్టుల వారీగా కేటాయించేలా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పధకానికి నిధుల కొరత లేకుండా ప్రభుత్వం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసింది.వివిధ ఆర్ధిక సంస్థల ద్వారా ఈ పధకానికి ఇప్పటికే రుణ ఒప్పందాలు అమలవుతున్నాయి. ఈ పధకం కింద ఇప్పటివరకూ రూ. 61వేల కోట్లు ఖర్చు చేశారు . కార్పోరేషన్ ద్వారా మొత్తం 91వేల కోట్లు రుణం తీసుకునేందుకు ఒప్పందాలు జరిగాయి. ఇందులో ఇప్పటికే 76వేల కోట్లు మంజూరయ్యాయి. వచ్చే ఏడాది అందుకు తగ్గట్టుగానే చివరి దశలో ఉన్న పలు సాగునీటి పధకాలను పూర్తి చేయడం ద్వారా వచ్చే ఏడాది రాష్ట్రంలో 20లక్షల ఎకరాల కొత్త అయకట్టుకు సాగు నీరందించాలని నీటి పారుదల శాఖ లక్ష్యాలు రూపొందించుకుంది. దీంతో కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల పధకంతోపాటు మరి కొన్ని కొత్త పధకాల ద్వారా పాక్షికంగా ఇప్పటికే 20లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించారు. లక్షం మేరకు పనులు జరిగితే వచ్చే కొత్త పధకాల ద్వారా వచ్చే వ్యవసాయ సీజన్‌లో ఆయకట్టు విస్తీర్ణం 40లక్షల ఎకరాలకు చేరనుంది.

కృష్ణానదీ జలాల ఆధారంగా చేపట్టిన ఎత్తిపోతల పధకాల పనులను కూడా వచ్చే ఏడాది ఒక కొలిక్కి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలమూరు-రంగారెడ్డి పధకానికి నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పధకం ద్వారా పాక్షికంగా ప్రయోజనం చేకూరేలా ఒక టిఎంసి నీటిని ఎత్తిపోసేలా చర్యలు చేపడుతున్నారు. డిండి ఎత్తిపోతల పధకానికి ఇప్పటికే రూ.1800కోట్లు ఖర్చయ్యాయి. ఈపధకానికి కూడా ఈ సారి నిధుల కేటాయింపులో తగిన ప్రాధాన్యం లభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. డిండి పధకం ద్వారా 30టిఎంసిలను ఉపయోగించుకుని 3.65లక్షల ఎకరాలను సాగులోకి తేవాలని లక్షంగా పెట్టుకున్నారు. ఈ పధకానికి ఒట్టి రిజర్వాయర్‌నుంచి నీటిని అందచేందుకు చేసిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోవాల్సివుంది.
నాబార్డు ద్వారా రూ.1400కోట్లు
రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎత్తిపోతల పధకాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 సాగునీటి ఎత్తిపోతల పధకాలను చేపట్టేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. ఈ పధకాలకు నాబార్డు రూ.1430కోట్లు ఆర్ధిక సాయం అందించనుంది.

TS Govt focus on Irrigation in State Budget 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News