Thursday, January 23, 2025

సంక్షేమ రంగంలో తెలంగాణ ఆదర్శం

- Advertisement -
- Advertisement -

ఆసరా పెన్షన్లు, సంక్షేమ పథకాలకు రూ.5లక్షల కోట్లు
తొమ్మిదేళ్ళలో పెన్షన్లకే రూ.58,696 కోట్లు ఖర్చు

మనతెలంగాణ/హైదరాబాద్ : సంక్షేమ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. తొమ్మిదేళ్ళ స్వారాష్ట్ర పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. సబ్బండ వర్గాలకు, ఆసరా అవసరమైన సకల జనులకు కనీస జీవన భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పం కార్యరూపం దల్చింది. ముఖ్యమంత్రి దార్శనికతతో మరే రాష్ట్రం అమలు చేయని విధంగా తె లంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా రూ.50 వేల కోట్లకు పై గా నిధులతో ప్రజా సం క్షేమ పథకాలు అమలు చే స్తోం ది.పదేళ్ళకు చేరుకున్న స్వరాష్ట్ర పాలనలో దాదా పు రూ. 5 లక్షల కోట్లు ఆసరా ఫించన్లు సహా పలు రకా ల సం క్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం దే శ సంక్షేమ రంగ చరిత్రలోనే తెలంగాణను అగ్రభాగాన నిలిపింది. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆసరా ఫించన్లు, ఇతర సంక్షేమ పథకాలు పేదల్లో ఆర్థిక భరోసాను ఆత్మగౌరవాన్ని నింపాయి. పెన్షన్లతో పాటు .రైతులకందించిన పంటపెట్టుబడి వంటి వ్యక్తిగత ఆర్థిక సాయం సామాజిక పెట్టుబడిగా మారింది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంలో స్వర్ణయుగా న్ని స్థాపించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా అందిస్తున్న మానవీయ ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం దేశ ప్రజల మన్ననలు అందుకుంటోంది.

ఎస్‌సిల సంక్షేమానికి పెద్దపీట
ఇప్పటికీ వివక్షకు గురవుతున్న ఎస్‌సిలను ఆదుకునేందు కు తెలంగాణ ప్రభుత్వం ఎస్‌సి కులాల అభివృద్ధి దిశ గా పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోం ది. ఆర్థిక స్వావలంబనను కల్పించే దిశగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దళితబంధు పథకాన్పి ప్రవేశ పెట్టింది. ఎస్ సి కులాల ఆర్థిక గౌరవంతోపాటు, సామాజిక గౌరవాన్ని పెంపొందించేందుకు ఈ పథకం దోహదపడుతుందని భావిస్తోంది దళితులను పారిశ్రామికవేత్తలుగా, పదిమందికి ఉపాధి కలిపించే ఎంటర్ ప్రెన్యూయర్లుగా తయరు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 1,60,914 మందికి రూ. 2,013. 64 కోట్ల రూపాయలను సబ్సిడీల ద్వారా రాయితీలు కల్పించి ప్రోత్సహించింది. తరతరాలుగా విద్యకు దూ రం చేయబడిన ఎస్‌సి కులాలకు నాణ్యమైన విద్య అం దించాలని ఎస్‌షి గురుకులాలను ఏర్పాటుచేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు . ఈ గురుకులాల్లో విద్యనభ్యసించిన విద్యార్ధులు అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సం స్థల్లో అడ్మిషన్లు సాధించి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐటి ప్రొఫెషనర్లుగా విజయ తీరాలకు చేరుకుంటున్నారు.

దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం
దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ అంబేద్కర్ ఆశయాలను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు, ఆ ఆశయాల సాధన లక్ష్యంతో ఈ విగ్రహాన్ని’ నెలకొల్పారు. నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ గార్డె న్స్ పరిసరాల్లో మొత్తం 11.6 ఎకరాల విస్తీర్ణంలో రూ. 146.50 కోట్లు ఖర్చుతో ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రూ. 140 కోట్ల ఖర్చుతో 910 ఎస్‌షి, కమ్యూనిటి హాళ్ళు నిర్మించడం జరిగింది. భవన్ లు, విగ్రహాల ఏర్పాటు రూ. 368.27 కోట్లను మంజూరు చేసింది.

గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలు
గిరిజన రాజకీయ సాధికారతా దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ ‘మా తండాలో మా రాజ్యం’ అనే గిరిజనుల చిరకా ల ఉద్యమ ఆకాంక్షకు కార్యరూపమిచ్చారు. 500 జనాభాను మించి ఉన్న 2,471 తండాలు, గూడాలను., నూ తనంగా గ్రామ పంచాయతీలుగా మార్చి ప్రభుత్వం చరి త్ర సృష్టించింది.గతంలోని 675 కలుపుకొని మొత్తం 3, 146 తండాలు, గూడాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. తద్వారా వేలాది మంది ఆదివాసీ, లంబాడీ, గిరిజన యువతీ యువకులను సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, రాజకీయ అధికారంలో భాగస్వాములను చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం ఉన్న 91 ఎస్‌టి గురుకులాలను , రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వల్పకాలంలోనే మరో 70 పాఠశాలలను స్థాపించారు. దీంతో మొత్తం ఎస్‌టి గురుకుల పాఠశాలల సంఖ్య 161 కి చేరుకున్నది.

బిసిల సంక్షేమం
తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల్లోని ప్రతీ కు లానికి ప్రత్యక్ష ప్రయోజనాలను చేకూర్చేలా ప్రవేశపెట్టిన పథకాలు బిసి కులాల్లో గుణాత్మక మార్పుకు దోహదం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలతో నేడు బిసీ లు సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. కుల వృత్తులను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం తెచ్చిన పథకాలతో నేడు ప్రతి పల్లె స్వయం సమృద్ధి సాధించి పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలనే నానుడిని నిజం చేస్తున్నాయి. పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ప్రీ – మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల నుండి డే స్కాలర్‌షిప్‌లు, మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకాలు అ మలు చేస్తున్నారు.

గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా జులై 2022 నాటికి 3.94 లక్షల యూనిట్లు పంపిణీ చే సింది. నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ పేషెంట్లకు, ఆసరాగా అర్హులైన వారందరికీ ప్రభుత్వం పింఛన్లతో భరోసానందిస్తున్నది. ఆడపిల్ల పెండ్లి కోసం ఆర్థిక భారంతో కుంగిపోయే నిరుపేద కుటుంబాలను పెండ్లి ఖర్చుల అవస్థలనుంచి గట్టెక్కించడానికి రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం ఎస్‌షి, ఎస్‌టి, బిసి, ఈబిసి, మైనారిటీ వర్గాలకు ‘కల్యాణలక్ష్మి’ షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది.

మైనారిటీల సంక్షేమం
సర్వమత సమభావన పునాదిగా అన్నివర్గాలలో విశ్వాసాన్ని నెలకొల్పుతూ, ఎవరిపట్లా వివక్షా, ఉపేక్షా లే కుండా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ ఫలాల ను స ర్వజనులకూ అందిస్తున్నది. మైనారిటీల అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. మైనారి టీ బాలుర కోసం 107, బాలికల కోసం 97 ప్ర త్యేక రెసిడెన్షియల్ స్కూళ్లను నెలకొల్పింది ఇమామ్ లకు, మౌజన్లకు నెలకు రూ.5 వేల చొప్పున మొత్తం 10 వేల మందికి జీవన భృతిని అందజేస్తున్నది. అగ్రవర్ణాల పేదలకు కూ డా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. దేవాలయాలను న మ్ముకొనిజీవనం సాగిస్తున్న నిరుపేద బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యం పథకం ద్వారా ఆదుకుంటున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News