Sunday, December 22, 2024

కొడంగల్ అభివృద్ధి కోసం KADA ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

కొడంగల్ నియోజకవర్గం ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వం నిర్ణయంతో ఇకనుంచి కొడంగల్ అభివృద్ధి బాట పట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కొడంగల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసి గెలిచిన విషయం తెలిసిందే. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు.

ఇందులో భాగంగా శనివారం కొడంగల్ నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం KADA(కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

దీంతో కొడంగల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అన్ని గ్రామాల్లో మౌళిక వసతులు, విద్యా, ఆరోగ్య రంగాల్లో నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోవడం, యువతకు ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు వంటి ప్రోగ్రామ్‌లను నిర్వహించనున్నారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News