Wednesday, January 22, 2025

2,440

- Advertisement -
- Advertisement -

TS Govt given permission to fill up 2440 posts

పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

త్వరలో నోటిఫికేషన్లు జారీ : హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. విద్యాశాఖ, ఆర్కైవ్స్ శాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1,392 మంది జూనియర్ లె క్చరర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిం ది. ఇంటర్ విద్యలో 40 లైబ్రరీయన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, ఆర్కైవ్స్ విభాగంలో 14 పోస్టులు, పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్లు, 14 ఇన్‌స్ట్ర క్టర్లు, 31 లైబ్రరీయన్లు, 5 మాట్రన్, 25 ఎలక్ట్రిషియన్ల్, 37 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, కళాశాల విద్యావిభాగంలో 491 లెక్చరర్ పోస్టులు, 24 లైబ్రరీ యన్లు, 29 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే 46,998 పో స్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ తాజాగా మరో 2440 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వం 49,428 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చినట్లయింది. ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చే ప్రక్రియ కసరత్తును ఆర్థిక శాఖ అధికారులు ముమ్మరం చేశారు. మరి కొద్ది రోజుల్లో మిగిలిన ఖాళీల నియామకాలకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేయనుంది.

* 491అధ్యాపక పోస్టుల్లో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, సంస్కృతం, గణాంకాలు,మైక్రో బయోలాగ్, బయో టెక్నోలజి ,అప్లైడ్ న్యూటిషన్,
కంప్యూటర్, వ్యాపార ప్రకటన, వాణిజ్యం, డైరీ సైన్స్, పంట ఉత్పత్తి, డేటా సైన్స్, మత్స్య సంపద, వాణిజ్యం- అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నారు.

* 1392 జూనియర్ అధ్యాపకుల పోస్టుల్లో అరబిక్ (2), వృక్షశాస్త్రం (113), వృక్షశాస్త్రం (ఉర్దూ 15), రసాయన శాస్త్రం (113), కెమిస్ట్రీ (ఉర్దూ 19),పౌరశాస్త్రం (56), పౌరశాస్త్రం (ఉర్దూ 16), సివిక్స్(1), వాణిజ్యం (50), వాణిజ్యం (ఉర్దూ 7), ఆర్థిక శాస్త్రం (81), ఆర్థిక శాస్త్రం (ఉర్దూ 15), ఇంగ్లీష్ (153), ఫ్రెంచ్ (2), హిందీ (117). చరిత్ర (60), చరిత్ర (ఉర్దూ 12), చరిత్ర/ పౌరశాస్త్రం (17), చరిత్ర/ పౌరశాస్త్రం ( ఉర్దూ 05), గణితం (154), గణితం ( ఉర్దూ 9), భౌతిక శాస్త్రం (112), భౌతికశాస్త్రం ( ఉర్దూ 18), సంస్కృతం (10), తెలుగు (60), ఉర్దూ (28), జంతుశాస్త్రం (128), జంతుశాస్త్రం ( ఉర్దూ 18) జూనియర్ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయనున్నారు.

రాష్ట్రంలో ఉద్యోగాల వర్షం : హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి

ఎడ్యుకేషన్, ఆర్కైవ్స్ విభాగాల్లో మరో 2,440 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదలతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల వర్షం కురుస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికత నాయకత్వంలో ఇప్పటి వరకు ఆర్థిక శాఖ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 49,428 ఉద్యోగాలకు ఉత్తర్వులు ఇచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News