Saturday, November 23, 2024

లాక్‌డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు

- Advertisement -
- Advertisement -

TS Govt gives Exemption to petrol bunks from lockdown

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకులకు లాక్‌డౌన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు హైవేలపై ఉన్న బంకులు మాత్రమే తెరిచి ఉంచే అవకాశం ఉండేది. వ్యవసాయ ధాన్యం తరలింపు వాహనాలు, ఎమర్జెన్సీ వాహనాలు లాక్‌డౌన్ సమయంలో పెట్రోల్, డీజిల్‌కు ఇబ్బంది పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం బంకులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇకపై రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు తెరుచుకోవచ్చు అని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

TS Govt gives Exemption to petrol bunks from lockdown

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News