ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలనుకునే ఉద్యోగులకు
ఉచితంగా రిజిస్ట్రేషన్ ?
మొదటి విడతగా లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి
హైదరాబాద్: రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. తాజాగా పెట్రోల్ వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపే విధంగా పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసేలా మరో నిర్ణయం తీసుకోనున్నట్టుగా సమాచారం. ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ అందించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. అంతేకాకుండా మొదటి విడతగా లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ సౌకర్యంతో ఎలక్ట్రిక్ వాహనాలను అందించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఈ నిర్ణయం ద్వారా పొల్యూషన్‌ను తగ్గించడంతో పాటు రోజు రోజుకూ పెరిగిపోతున్న పెట్రో ధరలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నామని త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అధికారులు పేర్కొంటున్నారు.