మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 3గం.లకు పట్నం మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న పట్నం మహేందర్‌రెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
మహేందర్ రెడ్డికి ఆరోగ్య శాఖ?
మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న పట్నం మహేందర్‌రెడ్డి వైద్యారోగ్య శాఖను కేటాయించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బర్తరఫ్‌తో మంత్రివర్గంలో ఖాళీ అయిన స్థానాన్ని పట్నం మహేందర్‌రెడ్డి భర్తీ ప్రభుత్వం భర్తీ చేస్తోండగా, గతంలో ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్న శాఖనే ఆయనకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బిఆర్‌ఎస్ అభ్యర్థులను ఇటీవల ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గ విస్తరణకు చేపట్టాలని నిర్ణయించారు.