Monday, December 23, 2024

చేయూత, మహాలక్ష్మీ పథకాలు ప్రారంభం.. ఇకనుంచి మహిళలకు ఫ్రీ జర్నీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో ఈరోజు చేయూత పథకం కింద ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత రవాణా పథకాలను ప్రారంభించింది ప్రభుత్వం. తొలుత ఆరోగ్య శ్రీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టీ కలిసి ప్రారంభించారు. అనంతరం అసెంబ్లీ ప్రాంగణం వద్ద మహాలక్ష్మీ పథకాన్ని మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖలు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓలంపిక్ లో మెడల్ సాధించిన బాక్సర్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించి ఆమెకు రూ.2కోట్ల చెక్ ను అందజేశారు.

ఆరోగ్యశ్రీ పథకం పరిధిని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10లక్షలకు పెంచింది. మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు హైదరాబాద్‌లో నడిచే సిటీ ఆర్డీనరి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ ఈ ఉచిత ప్రయాణం కల్పించింది. ఈరోజు నుంచే మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచిత ప్రయాణానికి అర్హులుగా ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర పరిధిలోని ఆర్ టిసి బస్సుల్లో మాత్రమే ఈ ఉచిత ప్రయాణం ఉండనుంది. మహిళా ప్రయాణికుల ఛార్జీ మొత్తాన్ని ఆర్‌టిసి ప్రభుత్వమే చెల్లించనుంది. మహిళా ప్రయాణికులు ప్రయాణించే వాస్తవ దూరం ఆధారంగా వసూలు చేసే ఛార్జీలను ప్రభుత్వం ప్రభుత్వం రీయింబర్స్ చేయనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News