- Advertisement -
హైదరాబాద్: ఎన్నికల విధుల్లో మరణించే వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికి అనుగుణంగా జీవో ఇచ్చింది. ఎన్నికల డ్యూటీలో మరణిస్తే రూ.10 లక్షలు ఇస్తుండగా దాన్ని రూ.15 లక్షలకు పెంచారు. ఎన్నికల విధుల్లో తీవ్రవాదులు, అసాంఘిక శక్తుల చర్యల వల్ల చనిపోతే ఇచ్చే రూ.20 లక్షలను రూ.30 లక్షలకు పెంచారు. శాశ్వత అంగవైకల్యం ఏర్పడే వారికి రూ.7.50 లక్షలు ఇవ్వనున్నారు.
TS Govt increase compensation of death in election duty
- Advertisement -