Saturday, November 16, 2024

వైద్య విద్యార్ధుల స్టైఫండ్ పెంపు

- Advertisement -
- Advertisement -

వైద్యవిద్యార్ధుల స్టైఫండ్ 15 శాతం పెంపు
ఉత్తర్వులు జారీ చేసిన ఆరోగ్యశాఖ

మన తెలంగాణ/హైదరాబాద్: వైద్యవిద్యార్ధుల స్టైఫండ్‌పై 15 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆరోగ్యశాఖ మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేసింది. ఎంబిబిఎస్, బిడిఎస్ హౌజ్ సర్జన్లు, పిజి డిగ్రి, డిప్లమో, ఎండిఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదువుతున్న విద్యార్ధి వైద్యులకు 2021 జనవరి 1 నుంచి 15 శాతం పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే తాజా ఉత్తర్వుల ప్రకారం మెడికల్, డెంటల్ హౌజ్ సర్జన్‌లకు ఇకపై నెలకు రూ.22,527 అందనుంది. పిజి, డిగ్రీ, పిజి డిప్లమో, ఎండిఎస్ మొదటి సంవత్సరం విద్యార్ధులకు నెలకు రూ.50,686, రెండో ఏడాది రూ.53,503, మూడో ఏడాది రూ.56,319ను ఇవ్వనున్నారు. ఇక సూపర్ స్పెషాలిటీ మొదటి సంవత్సరం విద్యార్ధులకు రూ.56,319, రెండో ఏడాది 59,135, మూడో ఏడాదికి రూ.61,949 చొప్పుల చెల్లించనున్నట్లు వైద్యశాఖ పేర్కొంది.

TS Govt Increased stipend for medical students

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News