Monday, January 20, 2025

పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచాలి: తెలంగాణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టు పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచి… వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పిపిఎ)ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్ సి మురళీధర్ పిపిఎకు లేఖ రాశారు.

2022 జూలైలో పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం ముంపునకు గురైందని లేఖలో పేర్కొన్నారు. దేశ అత్యున్నత స్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బ్యాక్ వాటర్ ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకునేదాకా.. వాటర్ ఇయర్లో గేట్లన్నీ తెరిచే ఉంచాలని లేఖలో రాష్ట్ర ప్రభుత్వం కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News