Monday, December 23, 2024

మైనార్టీలకు రూ.లక్ష ఆర్థికసాయం.. ఉత్తర్వులు జారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు రూ.లక్ష ఆర్థికసాయాన్ని ప్రకటించింది. మైనార్టీలకు ఆర్థికసాయంపై ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో బిసి బంధు తరహాలోనే మైనార్టీలకూ రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

పూర్తి సబ్సిడీతో మైనార్టీలకు రూ.లక్ష ఆర్థికసాయం అందించనున్నట్లు సిఎం చెప్పారు. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కులమతాలకు అతీతంగా పేదల అభివృద్ధికి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. భిన్న సంస్కృతులు, మతాచారాలను ప్రభుత్వం సమానంగా ఆదరిస్తోందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News