Thursday, January 23, 2025

మృగశిరకు చేపల ఘుమఘుమలు

- Advertisement -
- Advertisement -

 రుచులూరించేలా చేపల వంటకాలు
 జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక స్టాల్స్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వచ్చే నెలలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఫిష్ పుడ్ ఫెస్టివల్‌ను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో పశుసంవదర్ధక, మ త్యశాఖల ఉన్నతస్థాయి అధికారలలో సమీక్షా సమావేశం జరిగింది. జూన్ 8,9,10 తేదీలలో అన్ని జిల్లా కేంద్రాలలో మృగశిర కార్తె ను పురస్కరించుకొని ఫిష్ పుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. షిష్‌ఫుడ్ ఫెస్టివల్ ఏ ర్పాట్లపై పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా లతో కలిసి మత్స్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ముందుగా నూతనంగా మత్స్య సహకార సంఘాల సొసైటీ చైర్మన్ గా నియమితులైన పిట్టల రవీందర్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకు న్న తెలంగాణ రాష్ట్రం 10 వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపధ్యంలో జూన్ 2 వ తేదీ నుండి 21 రోజులపాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వివరించారు. ఫిష్ పుడ్ ఫెస్టివల్ ను అత్యంత ఘనంగా నిర్వహించేలా అనువైన ప్రాంతాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ లో చేపలతో తయారు చేసిన ఫిష్ ప్రై, కర్రీ, బిర్యానీ వంటి అన్ని ర కాల వంటకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

స్వయం ఉపాది పొందే విధంగా అన్ని జిల్లాల కు చెందిన మహిళా మత్స్యకారులకు చేపల తో వివిధ రకాల వంటకాల తయారీ పై ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరిగింద ని, వారి భాగస్వామ్యంతో ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించే ఫెస్టివల్‌లో 20 నుండి ౩౦ వరకు వివిధ రకాల చేప వంటకా ల స్టాల్స్ ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. అదేవిధం గా ప్రతి చోట విజయ డెయిరీ ఉత్పత్తులతో కూడిన స్టాల్ ను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News