Thursday, December 19, 2024

రాష్ట్రానికి మరో రూ.2500 కోట్ల రుణ సమీకరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనున్నది. ఈ నెల 5వ తేదీన (మంగళవారం) రిజర్వ్‌బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం అనుమతించడంతో.. రూ.2500 కోట్లను రుణంగా సమీకరించుకోనుంది. ఇందు కోసం 16, 20 ఏళ్ల కాలానికి రూ.1000, రూ.1500 కోట్లు చొప్పన రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. వేలం అనంతరం రాష్ట్ర ఖజానాకు ఆ మొత్తం సమకూరుతుంది. తెలంగాణతో పాటు మరో పదకొండు రాష్ట్రాలు ఈ వేలం ద్వారా రూ.15,700 కోట్ల రుణాలను సమీకరించనున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర రాష్ట్రాలు రూ. 3 వేల కోట్లు చొప్పునతో పాటు అస్సాం, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు నిధులను బాండ్ల వేలంలో సమీకరించుకోనున్నాయి. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఈ- కుబేర్) విధానంలో ఈ వేలం నిర్వహించనున్నారు.

ఆగస్టు 31 నాటికి 93 శాతం రూ.2 వేల నోట్లు బ్యాంకుల్లోకి..
ఆగస్టు 31 నాటికి 93 శాతం రూ.2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవడంతో బ్యాంకులకు తిరిగి రావడంతో గణనీయమైన పురోగతి సాధించామని ఆర్‌బిఐ తెలిపింది. ప్రజలు రూ. 2వేలను డిపాజిట్ చేయడానికి, మార్చుకోవడానికి ఈ నెలాఖరు వరకే గడువు ఉందని తెలిపింది. ఆ తర్వాత ఈ నోట్లు చట్టబద్ధంగా ఉండవు అని ఆర్‌బిఐ పేర్కొంది. మార్చి 31న చలామణిలో ఉన్న రూ. 2000 నోట్ల మొత్తం విలువ 3.62 లక్షల కోట్లు, మే 19, 2023న చెలామణి గడువు ప్రకటించే నాటికి 3.56 లక్షల కోట్లకు తగ్గింది. ఆగస్టు 31 వరకు చెలామణి నుంచి తిరిగి పొందిన 2000 నోట్ల మొత్తం విలువ 3.32 లక్షల కోట్లు అని ఆర్‌బిఐ తెలిపింది. మరో 0.24 లక్షల కోట్లుగా రూ.2 వేల నోట్లు చెలామణిలో ఉందని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News