Thursday, February 27, 2025

ఐఎఎస్‌లకు పోస్టింగులు ఖారారు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో సీనియర్ గ్రూప్ 1అధికారులకు ఇటీవలే ఐఎఎస్ హోదాను కల్పించిన ప్రభుత్వం వారికి పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత విధులు నిర్వహిస్తున్న స్థానాల్లోనే వారిని కొనసాగించనున్నారు.

రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండిగా నిర్మలా కాంతి వెస్లీ, వరంగల్ అదనపు కలెక్టర్ గా కోట శ్రీవాస్తవ, నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా బి.చంద్రశేఖర్, కరీంనగర్ జడ్పి సిఈఓగా ప్రియాంక, సాధారణ పరిపాలనా శాఖకు అరుణశ్రీ (అటాచ్ మెంట్), వాణిజ్య పన్నుల శాఖ పంజాగుట్ట డివిజన్ అదనపు కమిషనర్‌గా కె.హరిత, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శిగా కె.అశోక్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి ఓఎస్డీగా కాత్యాయని దేవి, టిఎస్‌ఐఐసి వైస్ ఛైర్మన్, ఎండిగా ఇ.వి.నర్సింహారెడ్డి, సాధారణ పరిపాలనా శాఖకు నవీన్ నికోలస్ (అటాచ్ మెంట్)లను కేటాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News