Monday, December 23, 2024

యాసంగి ప్రణాళిక సిద్ధం

- Advertisement -
- Advertisement -

ఈసారి 31లక్షల ఎకరాలకు వరి అంచనా, 3.45లక్షల ఎకరాల్లో పప్పుధాన్య పంటలు 
3.74లక్షల ఎకరాల విస్తీర్ణంలో నూనెగింజల సాగు, వాణిజ్య పంటల ఖాతాలోకి మిరప

ఈసారి 25వేల ఎకరాలకు సాగు లక్ష్యం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి పంటల సాగు విస్తీర్ణపు ప్రాథమిక లక్ష్యాలను ప్రభుత్వం ఖరారు చేసింది. అన్నిరకాల పంటలు కలిపి 46,49,676 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయించాలని ప్రాథమిక ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళికలో ప్రధానంగా అ త్యధిక శాతం వరిసాగు విస్తీర్ణమే ఆక్రమించింది. గత ఏడాది యాసంగితో పోలిస్తే ఈ యాసంగిలో సుమారు 10లక్షల ఎకరాలను అధికంగా అంచనా వేసింది. గత యాసంగిలో పంట సాగు విస్తీర్ణం 36,43,770 ఎకరాలుగాప్రాథమిక అంచనా వే సింది. ఈ సీజన్‌లో ఇప్పటికే కృష్ణా, గోదావరి నదుల పరీవాహకంగా జల వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ప్రాజెక్టులు, చెరువులు కుంటల్లో పుష్కలంగా నీటి అందుబాటులో ఉండడం, భూగర్భ జల మట్టాలు కూడా సమృద్ధిగా ఉండడం తో వరి పంట 31,01,258 ఎకరాల్లో సాగు చే యించాలని ప్రాథమిక లక్ష్యాలు ఎంపిక చేసింది. గత యాసంగిలో వరిసాగు 22,19,326 ఎకరాలుగా ప్రాథమిక అంచనా వేసింది. ఈసారి వరిసా గు విస్తీర్ణంపై ఎటువంటి ఆంక్షలు లేకపోవడంతో వ్యవసాయ శాఖ కూడా సాగు విస్తీర్ణపు అంచనాలను మరో 10లక్షల ఎకరాలకు పెంచింది. ముత క ధాన్యపు పంటల్లో వరి తర్వాత మొక్కజొన్న పంట 4,32, 281 ఎకరాల్లో సాగుకు ప్రణాళిక రూపొందంచింది. గోధుమ 12375 ఎకరాలు, జొన్న 75174 ఎకరాలు, సజ్జ 22967ఎకరాలు, రాగి 689ఎకరాల విస్తీర్ణంలో సాగు అంచనాలు రూపొందించింది. చిరుధాన్య పంటల్లో కొర్ర 148 ఎకరాలు, ఇతర పంటలు 17ఎకరాల్లో సాగుకు అంచనా వేసింది.
3.45లక్షల ఎకరాల్లో పప్పుధాన్య పంటలు
ఈ యాసంగికి రాష్ట్రంలో 3,45,118 ఎకరాల విస్తీర్ణంలో పప్పు ధాన్య పంటల సాగును అంచనా వేసింది. గత యాసంగిలో కంది, మినుము పెసర తదితర అన్ని రకాల పప్పుధాన్య పంటల సాధారణ సాగు విస్తీర్ణం 3.03లక్షల ఎకరాలుగా ఆంచ నా వేసింది. అయితే ఈసారి ఈ పంటల విస్తీర్ణం మరో 42వేల ఎకరాల్లో అదనంగా సాగుకు అంచ నా వేసింది. అందులో కంది 1650 ఎకరాలు, పప్పు శనగ 2,84,646 ఎకరాలు, పెసర 21448 ఎకరాలు, మినుము 24,018 ఎకరాలు, ఉలవ 2,052 ఎకరాలు, 9701 ఎకరాలు, ఇతర పప్పు ధాన్య పంటలు మరో 1563 ఎకరాల్లో సాగుకు అంచనా వేసింది.
3.74లక్షల ఎకరాల్లో నూనెగింజ పంటలు
రాష్ట్రంలో ఈ సారి 3,74,174 ఎకరాల విస్తీర్ణంలో నూనె గింజ పంటల సాగును అంచనా వేసింది. గత యాసంగిలో కూడా అన్ని రకాల నూనెగింజ పంటల సాగు 3.73లక్షల ఎకరాల విస్తీర్ణంతోనే ప్రాథమిక అంచనా వేసింది. ఈ ఏడాది కూడా అంతే విస్తీర్ణంపు అంచనాలతో సాగు ప్రణాళిక రూపొందించింది. అందులో ప్రధానంగా వేరుశనగ 3,01,616 ఎకరాల విస్తీర్ణంలో సాగుకు ప్ర ణాళిక రూపొందించింది. నూగు పంట 45320 ఎకరాలు, పొద్దుతిరుగుడు 10,947 ఎకరాలు, కు సుమ 7609 ఎకరాలు ఇతర నూనెగింజ పంటలు 8682 ఎకరాల్లో సాగుకు అంచనా వేసింది.
25వేల ఎకరాల్లో మిరప
ప్రధాన వాణిజ్య పంటల్లో ఈసారి మిరప సాగుకు ప్రాధాన్యత పెరిగింది. ఉద్యాన పంటల సాగు ఖాతాలో ఉన్న మిరప సాగును ఈసారి వ్యవసా య శాఖ వాణిజ్య పంటల సాగు జాబితాలో చేర్చింది. యాసంగిలో 25714 ఎకరాల్లో మిరపసాగు విస్తీర్ణతను అంచనా వేసింది. అదేవిధంగా కూరగయాల సాగు జా బితాలో ఉన్న కూడా వ్యవసాయశాఖ సాగు 17813 ఎకరాలు అంచనా వేసింది. పొగాకు పంట సాగును గత ఏడాది కంటే 2వేల ఎకరాలు తగ్గించి ఈ సారి 6490ఎకరాల విస్తీర్ణానికి పరిమితం చేసింది. ఇతర పంటలు 2,35,358 ఎకరాల్లో సాగుకు అంచనా వేసింది.

TS Govt prepared yasangi plan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News