Friday, December 20, 2024

టెన్త్‌లో ఆరు పేపర్లే

- Advertisement -
- Advertisement -

TS Govt Reduced SSC Exam papers in 2023

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్రవహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా 2021లో 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకు న్న విషయం తెలిసిందే.

అయితే ఆ ఏడాది కరోనా ఉధృతి కారణంగా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాలేదు. ఇక 2022లో విద్యా శాఖ పదో తరగతి పరీక్షలు నిర్వహించింది. అప్పుడు 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహించారు. మళ్లీ తాజాగా 2023లోనూ 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో తెలుగు, ఇంగ్లీష్, గణితం, సామా న్య శాస్త్రం, సాంఘీకశాస్త్రం సబ్జెక్టులకు రెండు పేపర్లుగా నిర్వహించేవారు. హిందీ సబ్జెక్టుకు ఒకే పరీక్ష నిర్వహించేవారు. కరోనా కారణంగా 11 పేపర్లకు బదులు 6 పేపర్లకు కుదించారు.

TS Govt Reduced SSC Exam papers in 2023

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News