- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకోసం పురపాలక శాఖ రూ.40కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల్లో రూ.8.75 కోట్లు పైప్‌లైన్ పనులకు, రూ.1.27 కోట్లు సిసిరోడ్ పనులకు, రూ.0.20కోట్లు సైదాపురం వద్ద జంక్షన్ల అభివృద్ధికి, మరో రూ.0.30కోట్లు ఆర్టీసి డిపో వద్ధ జంక్షన్ అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. బస్‌డిపో క్రాస్‌రోడ్ తోపాటు కమ్మర వాడ, జమ్మికుంట ప్రాంతాల్లో సిసి రోడ్ల అభివృద్ధికి రూ.3కోట్లు, అంబేద్కర్ జంక్షన్లో సిసిరోడ్కు రూ.1.40 కోట్లు, కాల్వల నిర్మాణం కోసం రూ.4.50కోట్లు, పట్టణ పరిధిలోని 1,2,3,4 వార్డుల్లో సిసి రోడ్లకు రూ.2కోట్లు ఖర్చు చేయనున్నారు.
TS Govt released rs 40 cr to Huzurabad
- Advertisement -