హైదరాబాద్ : రాష్ట్రంలోని గిరిజన ఆవాసాలలో బిటి రోడ్ల కోసం ప్రభుత్వం రూ. 441.21 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలోని 28 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని ఆ దివాసీ గూడేలు, లంబాడి తండాలు, చెంచుపెంటలకు 252 బిటి రోడ్ల కోసం గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ నిధుల విడుదల చేశారు. గత సంవత్సరం నాటికి 3,772 గిరిజన ఆ వాసాలలో రూ. 2,276 కోట్లను ఖర్చుచేసి బిటి రోడ్ల ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. తాజాగా మరో 554 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి నిధులు అందించింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం అచ్చంపేట, ఆలేరు, అం దోల్, బాన్సువాడ, బోధన్, భువనగిరి, చేవెళ్ల, దేవరకొండ, ధర్మపురి, దుబ్బాక, హుస్నాబాద్, హుజూర్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, కోదాడ, కొడంగల్, మహేశ్వరం, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, పరిగి, షాద్‌నగర్, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, తుంగతుర్తి, వికారాబాద్, వనపర్తి, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని గిరిజన ఆవాసాలకు బిటి రోడ్లు రానున్నాయి.