Monday, December 23, 2024

రైతుకు అండగా నిలిచిన కేసిఆర్ సర్కారు

- Advertisement -
- Advertisement -

ప్రకృతి వైపరిత్యాల్లో రైతుకు అండగా నిలిచిన కేసిఆర్ సర్కారు
పంటనష్టం పరిహారం కింద రూ.151.46కోట్లు విడుదల
రైతుల ఖాతాలకు ఎకరాకు రూ.10వేలు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రకృతి వైపరిత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు కేసిఆర్ సర్కారు అండగా నిలిచింది. అకాల వర్షాలు, వడగళ్ల వానలతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.151.46కోట్లు విడుదల చేసింది. ఎకరానికి రూ.10వేలు చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే నగదు జమ చేసేందకు చర్యలు చేపట్టింది. యాసంగిలో సాగు చేసిన వివిధ రకాల పంటలకు సంబంధించి గత మార్చినెలలో 16నుంచి 21వరకూ అకాల వర్షాలు వడగళ్ల వానల ప్రభావం వల్ల తెలంగాణలోని 26 జిల్లాల్లో అకాల వర్షాలు, వడగళ్లతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభత్వం రూ.151.46 కోట్ల పరిహారం విడుదల చేసింది.

ఈ నిధులను జిల్లాల వారీగా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులకు పంపించి, నేరుగా రైతుల ఖాతాల్లో వేయాలని ఆదేశించింది. గతంలో పరిహారంగా చెక్కులను అందజేసేవారు. ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నేరుగా నగదు బదిలీకి ఆదేశించారు. మార్చిలో కురిసిన అకాల వర్షాలతో వరి, జొన్న, మిర్చి, వేరుసెనగ, పత్తి, కూరగాయలు, మామిడితోటలు దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో పంట నష్టాలను స్వయంగా పరిశీలించి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు వ్యవసాయశాఖ సర్వేలు నిర్వహించి 1,51,645 ఎకరాలకలో పంటు నష్టాలు జరిగినట్టు గుర్తించింది. ఇందుకు అనుగుణంగా 1,30,988 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండు మూడు రోజుల్లో ఈ నిధులు రైతుల ఖాతాలకు చేరిపోనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News