Thursday, January 23, 2025

ఆపదలో మన బిడ్డలు.. ఆదుకున్న ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

మణిపూర్ అల్లర్లలో చిక్కుబడిపోయిన తెలంగాణ బిడ్డలు

ఇంఫాల్‌లోని సమీపంలో లోంగోల్‌లో పేలుడు

నిట్‌లో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ విద్యార్థులు

సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక విమానం పంపిన తెలంగాణ సర్కార్
హెల్ప్‌లైన్ నెంబర్ 7901643283 పరిస్థితిని సమీక్షించిన సీఎస్ శాంతికుమారి, డిజిపి అంజనీ కుమార్

మన తెలంగాణ/సిటీబ్యూరో: మణిపూర్ రాష్ట్రంలో చిక్కుకున్న తెలంగాణ పౌరులను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రత్యేక హెల్స్ లైన్ నంబర్, ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. మణిపూర్ రాష్ట్రం ఆందోళనలతో అట్టడు కుతోంది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో వాటిని అదుపు చేసేందుకు పోలీసులు కర్ఫూ అమలు చేస్తున్నారు. మణిపూర్ రాష్ట్రంలో చదువుకునేందుకు, ఉద్యోగాలు చేసేందుకు వెళ్లిన తెలంగాణ ప్రజలను సురక్షితంగా ఇక్కడికి తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం వేగంగా స్పందించింది. తెలంగాణ పౌరులు, విద్యార్థుల కోసం డిఐజి సుమతి ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని రాష్ర్ట డిజిపి అంజనీకుమార్ తెలిపారు. సాయం కోసం 7901643283 నంబర్‌లో గానీ, dgp@tspolice.gov.inలో సంప్రదించాలని కోరారు.

అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు మణిపూర్ పో లీసులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణకు చెందిన 250 మంది విద్యార్థులు మణిపూర్ రాజధాని ఇంఫాల్ దాని పరిసర ప్రాంతాల్లో చదువుకుంటున్నారని తెలిపారు. వారిని విమానంలో తీసుకుని వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రత్యేక విమానం ఆదివారం ఉదయం ఇంఫాల్ నుంచి బయలుదేరుతుందని తెలిపారు. విద్యార్థులను విమానంలో మణిపూర్ నుంచి హైదరాబాద్‌కు తీసుకుని రానున్నట్లు తెలిపారు. విద్యార్థులను సురక్షి తంగా హైదరాబాద్‌కు తీసుకుని వచ్చేందుకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, మణిపూర్ చీఫ్ సెక్రటరీతో సంప్ర దింపులు జరుపుతున్నారన్నారు. ఇప్పటి వరకు 50 మంది విద్యార్థులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News