Sunday, December 22, 2024

ధరణి పోర్టల్ ట్యాంపరింగ్‌పై ప్రభుత్వం సీరియస్!

- Advertisement -
- Advertisement -

Made easy buying and selling with dharani in TS
ధరణి పోర్టల్ ట్యాంపరింగ్‌పై ప్రభుత్వం సీరియస్!
సమగ్రంగా వివరాలను అందచేయాలని అధికారులకు ఆదేశం
మిగతా జిల్లాలో ఇలాంటి సంఘటనలపై ఆరా
త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతాం:సిసిఎల్‌ఏ అధికారులు

మనతెలంగాణ/హైదరాబాద్: ధరణి పోర్టల్ ట్యాంపరింగ్‌ను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. మంగళవారం మనతెలంగాణలో వచ్చిన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్‌గోముల్ గ్రామానికి పలువురు రైతులకు పాస్ పుస్తకాలు ఉన్నా పెండింగ్ మ్యుటేషన్ చూపించడంపై సిసిఎల్‌ఏ అధికారులు ఆరా తీసినట్టుగా తెలిసింది. ముఖ్యంగా మీసేవ ఆపరేటర్‌ల వల్లే ఇలా జరిగిందా, వారు ఏ విధమైన యాక్సెస్‌ను కలిగి ఉన్నారన్న దానిపై సిసిఎల్‌ఏ అధికారులతో సమీక్ష జరిపినట్టుగా తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేసులు ఎక్కడైనా చోటు చేసుకున్నాయా, ఉంటే ఎలా జరిగింది, తదితర వివరాలను సిసిఎల్‌ఏ తెప్పించుకునే పనిలో పడ్డట్టుగా తెలిసింది. ధరణి పోర్టల్ రూపకల్పనకు అధునాతన టెక్నాలజీని వాడడంతో పాటు ఎవరూ దానిని ట్యాంపరింగ్ చేయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అయినా పాసు పుస్తకం ఉన్న రైతుల భూములకు పెండింగ్ మ్యుటేషన్ చూపించడంపై సిసిఎల్‌ఏ అధికారులు విస్మయం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ఇన్ని రోజులుగా తమ దృష్టికి ఈ అంశాన్ని ఎందుకు తీసుకురాలేదని సిసిఎల్‌ఏ అధికారులు వికారాబాద్ జిల్లా అధికారులను ప్రశ్నించినట్టుగా తెలిసింది. త్వరలోనే ఈ అంశానికి కలెక్టర్ లాగిన్‌లో పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ధరణిలో నెలకొన్న పలు అంశాలపై సిసిఎల్‌ఏ అధికారులు చర్చించినట్టుగా తెలిసింది. సిఎస్ సోమేష్‌కుమార్ కూడా దీనికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం. దీనిపై సమగ్రంగా వివరాలు ఇవ్వాలని సంబంధిత కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలిసింది. రైతులు ఎలాంటి కలత చెందొద్దని త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని సిసిఎల్‌ఏ అధికారులు పేర్కొంటున్నారు.

TS Govt Serious on Dharan Portal Tampering

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News