Monday, December 23, 2024

సమ్మె విరమిస్తేనే స్పష్టమైన హామీ

- Advertisement -
- Advertisement -

జూనియర్ కార్యదర్శుల సమ్మెపై ప్రభుత్వం సీరియస్
సమ్మె విరమించుకోవాలని సూచన
రేపటి నుంచి విధులకు హాజరుకాకపోతే చర్యలు
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన దక్కని హామీ
మనతెలంగాణ/ హైదరాబాద్: తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్‌తో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు(జిపిఎస్)లు చేస్తున్న సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. పది రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. సోమవారం నుంచి జూనియర్ కార్యదర్శులు విధులకు హాజరు కాకపోతే తీవ్ర చర్యలు తప్పవని ప్రభుత్వ వర్గాల సమాచారం.

ఆదివారం రాత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధులు కలిశారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి ఎర్రబెల్లి వారికి స్పష్టం చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారం విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా ఉన్నారని మంత్రి వారికి వెల్లడించారు. సమ్మె విరమిస్తేనే ప్రభుత్వం తరపున స్పష్టమైన హామీ వస్తుందని వెల్లడించారని ప్రతినిధులు తెలిపారు.

స్పష్టమైన హామీకి జెపిఎస్‌ల వేడుకోలు..
తమ ఉద్యోగాల క్రమబద్దీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో తమ కుటుంబాలు, పిల్లలతో కలిసి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాల్లో కార్యదర్శులు పాల్గొంటున్నారు. వీరికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.

పంచాయతీరాజ్ శాఖలో దాదాపు 9,500
మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల క్రమబద్ధీకరించే ప్రక్రియను చేపట్టాలని వారు కోరుతున్నారు. వీరి సమ్మె ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ సేవలపై ప్రతికూల ప్రభావం చూపడంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జనన, మరణం, వివాహం, నివాసం వంటి ముఖ్యమైన ధృవీకరణ పత్రాలను జారీ చేయడంతో పాటు గ్రామ పారిశుధ్యం, తాగునీటి సరఫరా, పచ్చదనం పనుల నిర్వహణలో వీరి పాత్ర కీలకంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం అగ్రహంతో ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News