హైదరాబాద్: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన వలసదారులు, విద్యార్థులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్, రాష్ట్ర సచివాలయంలో హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హెల్ప్‌లైన్‌లకు నిన్న రాత్రి నుంచి 75 కాల్స్ వచ్చాయని తెలిపారు. ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్, ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎస్, రాష్ట్ర ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. కాగా, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు సహాయం చేసేందుకు ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో మాట్లాడినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఉక్రెయిన్ గగనతలం మూసివేయబడినందున, భారతీయ పౌరులను తరలించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఏ సహాయం కావాలన్నా ఢిల్లీ తెలంగాణ భవన్ హెల్ప్ లైన్ 7042566955, 9949351270, 9654663661 నంబర్లకు సంప్రదించడానికి సిఎస్ పేర్కొన్నారు.
తెలుగువారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -