Monday, December 23, 2024

ప్రజా సమస్యల పరిష్కారంలో మనమే నెం.1

- Advertisement -
- Advertisement -

అతి తక్కువ ఫిర్యాదులు.. పరిష్కారంలో వేగం మన సొంతం

కేంద్ర పర్సనల్, ప్రజా సమస్యలు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ప్రశంస

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అమలులో ఉన్న ప్రభుత్వ పాలనా సంస్కరణలు, పరిపాలనా విధానాలకు కేంద్ర ప్రభుత్వం కితాబునిచ్చింది. ప్రజా సమస్యలు, వివాదాలను పరిష్కరించడంలో తెలంగాణ రా ష్ట్రం జాతీయస్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మాటలన్నది ఎవ్వరో కాదు.. ప్ర ధానమంత్రి నరేంద్ర సారథ్యం వహిస్తు న్న పర్సనల్, పబ్లిక్ గ్రీవియెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నెలకు 15వేలలోపు ప్రజా సమస్యల ధరఖాస్తులను పరిష్కరించిన రాష్ట్రాల జాబితాలో 72.49 శాతం స్కోర్‌తో తె లంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర మం త్రిత్వశాఖ తెలిపింది. రెండో స్థానంలో నిలిచిన చత్తీస్‌గఢ్ 55.79 శాతం స్కోర్‌ను సాధించింది.

మూడోస్థానంలో నిలిచిన ఉత్తరాఖండ్ 49.69 శాతం స్కోర్‌ను సాధించింది. గత మే నెలలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1,94,713 సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, 65,983 ప్రజా సమస్యలు పరిష్కారమయ్యాయని ఆ మంత్రిత్వశాఖ 10వ నివేదికలో పేర్కొంది. నెల కు 15వేల లోపు ప్రజా సమస్యల దరఖాస్తులు వచ్చిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ప్రభు త్వం 72.49 శాతం సమస్యలను అతి త్వరగా పరిష్కరించి అగ్రస్థానంలో నిలిచింది. తెలంగా ణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు తక్కువ సంఖ్యలో ఉండటమే కాకుండా ఆ కొద్ది సమస్యలు కూడా వేగంగా పరిష్కరించిన రాష్ట్రంగా జాతీయస్థాయిలో రికార్డు సృష్టించింది. సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర సారథ్యం వహిస్తున్న మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదిక కావడంతో ఈ రిపోర్టుకు
అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇక 15వేల పై చిలుకు సమస్యలు వచ్చి, వాటిని వేగంగా పరిష్కరించిన రాష్ట్రాల జాబితాలో ఉతరప్రదేశ్ రాష్ట్రం 62.07 శాతం స్కోరుతో అగ్రస్థానంలో నిలిచిం ది.

గత మే నెలలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి 18,404 ధరఖాస్తులు వచ్చాయని, అందులో 16,780 సమస్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించిందని ఆ నివేదిక తెలిపింది. 46.14 శాతం స్కోర్‌తో జార్ఖండ్ రెండో స్థానంలో నిలిచింది. 43.05 శాతం స్కోరుతో మధ్యప్రదేశ్ మూడోస్థానంలో నిలిచింది. ఈశా న్య రాష్ట్రాల జాబితాలో 64.90 శాతం స్కోరుతో సిక్కిం మొదటి స్థానంలో నిలవగా, అస్సాం 54.89 శాతం స్కోరుతో రెండో స్థానం, అరుణాచల్‌ప్రదేశ్ 51.72 శాతం స్కోరుతో మూడో స్థానంలో నిలిచాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసమస్యలు ఎక్కడికక్కడనే పరిష్కారమయ్యేందుకు వీలుగా పరిపాలనా వికేంద్రీకరణ సాధించిన ఘనత ఇదని కొందరు సీనియర్ అధికారులు సగర్వంగా వివరించారు. వందలాది కిలోమీటర్ల సుదూరాలు న్న జిల్లా కేంద్రాలను ప్రజలకు దగ్గరకు చేర్చ డం కోసం పది జిల్లాలను ఏకంగా 33 జిల్లాలు గా విభజించడం, రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాలను భారీ సంఖ్యలో పెంచడం మూలంగానే ఎక్కడి సమస్యలు అక్కడనే పరిష్కారమవుతున్నాయని ఆ అధికారులు వివరించారు.

తెలంగాణ ప్రాంతంలో 2014లో కేవలం 43 ఉ న్న రెవెన్యూ డివిజన్లకు అదనం గా 31 కొత్తగా ఏర్పాటు చేయడంతో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 74కు పెరిగాయని, దాంతోపాటుగా 459 మం డలాలను విభజించి కొత్తగా మరో 153 మండలాలను ఏర్పాటు చేశామని, దాంతో మండలాల సంఖ్య ప్రస్తుతం 612కు పెరిగాయని వివరించారు. తెలంగాణలో 7,855 గ్రామ పంచాయతీలుండగా కొత్తగా 4914 గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసుకోవడంతో ప్రస్తుతం రికార్డుస్థాయిలో 12,769కి గ్రామ పంచాయితీల సంఖ్య పెరిగిందని వివరించారు. ప్రత్యేక రా ష్ట్రంగా ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో కేవ లం రెండు పోలీస్ కమిషనరేట్‌లు మాత్రమే ఉండేవని, కొత్తగా ఏడు పోలీస్ కమిషనరేట్‌ల ను ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం అవి కాస్తా తొమ్మిదికి పెరిగాయని వివరించారు.

పోలీస్ సబ్ డివిజన్లు 139 ఉంటే వాటికి అదనంగా మరో 24 సబ్ డివిజన్లను ఏర్పాటు చేశామని, దాంతో ఈ సంఖ్య 163కి పెరిగిందని, పోలీస్ సర్కిల్ కార్యాలయాలు 688 ఉండగా కొత్తగా 29 ఏర్పాటు చేయడంతో ఆ సంఖ్య 717కు పె రిగిందని, రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ల సంఖ్య 712 ఉండగా కొత్తగా మరో 102 స్టేషన్లను ఏర్పాటు చేయడంతో 814కు ఆ సంఖ్య పెరిగిందని వివరించారు. అదే విధంగా మున్సిపాలిటీల సంఖ్య కేవలం 68 మాత్రమే ఉండగా మరో 74 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంతో ఆ సంఖ్య 142కు పెరిగిందని, అదే విధంగా ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు అదనంగా మరో ఏడు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడంతో ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లు అయ్యాయని వివరించారు.

ఇలా ప్రజల వద్దకు అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు వెళ్లడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వాహనాలు పెద్ద సంఖ్యలో తిరుగుతుండటం, మునుపెన్నడూ చూడని ఆఫీసర్లు గ్రామాలకు వస్తూండటంతోనే ఎక్కడికక్కడనే తమ సమస్యలు పరిష్కారమవుతున్నాయని వివరించారు. పైగా అ భివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేసే క్రమంలో జిల్లాలకు సంబంధించిన సమస్త అధికారాలన్నీ కలెక్టర్లకే కట్టబెట్టడంతో 80 శాతం ప్రజా సమస్యలన్నీ ఆ జిల్లాల్లోనే పరిష్కారమవుతున్నాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News