Wednesday, November 6, 2024

మెరుగైన విద్య, వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/సత్తుపల్లి: ఆదివాసీల సమగ్ర అభివృద్దికై మెరుగైన విద్య, వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మండల పరిధిలోని రేగళ్ళపాడు గ్రామంలో డిఎంఎఫ్‌టు, ఎన్‌ఆర్‌ఈజిఎస్ నిధులు రూ. 15 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణాలకు, రూ. 20 లక్షలతో నూతన గ్రామపంచాయితీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి గ్రామంలో రూ. 17 లక్షలతో మన ఊరు – మన బడి కార్యక్రమంలో అభివృద్ది పనులు చేసిన పాఠశాలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ విద్యా వ్యవస్థపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందని, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్ధుల కొరకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. గ్రామాలు క్షేత్రస్థాయిలో అభివృద్ది చెందాలనే తలచి తండాలను గ్రామపంచాయితీలుగా ఏర్పాటు చేసి, గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు సమకూర్చి నేడు మన గ్రామాలను మనమే పరిపాలన చేసే అవకాశం కేసీఆర్ ప్రభుత్వం చేసిందన్నారు. దళితబంధు తరహాలో గిరిజన బంధుతో ఆదివాసీల సాధికారత కొరకు కృషిచేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతుందన్నారు. గిరిజనుల పోడు భూముల సమస్య పరిష్కారమే ప్రభుత్వ లక్షంగా గిరిజనుల హక్కులు కాపాడే ధ్యేయంగా 11 లక్షల ఎకరాల పోడు భూములు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News